నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. జోరు వానలు ప్రజలను తేరుకోనివ్వటం లేదు. ఉరుములు, మెరుపులు భయకంపితులను చేస్తున్నాయి. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.