మార్చి 16న రేణిగుంట నుంచి 'రామాయణ యాత్ర స్పెషల్‌'

శనివారం, 23 జనవరి 2021 (11:13 IST)
రేణిగుంట రైల్వే స్టేషన్‌ నుంచి మార్చి 16వ తేదీన రామాయణ యాత్ర స్పెషల్‌ రైలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

అయోధ్య, చిత్రకూట్‌, వారణాసి, గయా, నందిగ్రామ్‌, ప్రయాగరాజ్‌, శృంగేశ్వర్‌పూర్‌ సందర్శన ఉంటాయన్నారు. 9రాత్రులు, 10 పగల్లో దర్శనీయ వసతులు కల్పిస్తామని వివరించారు.

టిక్కెట్‌ ధర్‌ స్లీపర్‌క్లాస్‌ రూ.11,395, 3ఏసీ రూ.13,495గా నిర్ణయించారు. ఈ యాత్రా స్పెషళ్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 0877-2222010, 82879 32317, 82879 32313 నెంబర్లలో సంప్రదించవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు