రాయలసీమ వెనుకబాటుతనంపై చర్చజరగాలి: సోము వీర్రాజు

మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (15:59 IST)
రాయలసీమ ప్రాజెక్టులు, వెనుకబాటుతనం, హిందుత్వంపై జరుగుతున్న దాడులపై చర్చజరగాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

తిరుపతిలో ఒక సూటల్లో మంగళవారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమలో తాగునీరు, సాగునీరు, ఉ పాధి అవకాశాలు లేక ప్రజలు విలవిలలాడుతున్నారన్నారు. 30 ఏళ్లుగా పూర్తికాని హంద్రీ-నీవా, గాలేరు నగరి తెలుగుగుంగ ప్రాజెక్టుల పూర్తిచేయకపోవడమే దీనికి కారణమని చెప్పారు.

ఈ ప్రాంతంలో ఎర్రచందనం, ఇతర వనరులుతో పరిశ్రమలు ఏర్పాటుచేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందేదన్నారు. ఈ నిర్లక్ష్యానికి పూర్వముఖ్యమంత్రులతో పాటు చంద్రబాబు, జగన్ వైఖరే కారణమని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు 2017లో ప్రారంభిస్తే ఇప్పటికి రూ.15 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని, మీ పాలనలో రాయలసీమకు ఏం చేశారో చెప్పగలరా?

రాయలసీమకు నిరక జలాలు ఎందుకివ్వరని చంద్రబాబు, జగన్లను ప్రశ్నించారు. ఇవి హెూదా కంటే ఇవి ముఖ్యమైనవని అందువల్ల వీటిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఇలా మాట్లాడారు...
 
చంద్రబాబు, జగది అవినీతి అజెండా. చంద్రబాబు రూ.7,200 కోట్లు ఖర్చుచేసి రాజధాని కట్టలేదు జగన్ కు 2 ఏళ్లయినా రాజధానిపై అవగాహన లేదు. మద్యం తయారుచేస్తున్నారు. భూముల్ని వేలం వేస్తారు ఇసుకను ప్రైవేటుపరం చేస్తున్నారు కాని నిందలు మాపై వేస్తున్నారు.

రాష్ట్రంలో అన్నిరకాల రహదారులు నిర్మిస్తున్నాం నరేగా పథకానికి గతంలో రూ.40 వేల కోట్లిస్తే ఈ రెండేళ్లలో రూ. 20 వేల కోట్లిచ్చాం. విద్య, ఆరోగ్యంపై మీకేటాయింపులేంటి? తిరుపతిలో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కేంద్రానివే. రూ. లక్షల కోట్లు రాష్ట్ర అభివృద్ధికి కేటాయించాం భాజపా చేసిన అభివృద్ధి తప్ప మీరేం చేశారో చెప్పగలరా?

మాది అభివృద్ధి అజెండా. మీది దోపిడి, అవినీతి అక్రమాలు, ఫెయిల్యూర్ అజెండా. హంద్రీ-నీవా, గాలేరు నగరి, తెలుగుగుంగ ప్రాజెక్టుల పూర్తిచేయకపోవడంపై చంద్రబాబు, జగన్ సమాధానం చెప్పాలి
 
హిందూత్వం అంటే హేళనా
వైకాపా ప్రభుత్వానికి హిందూత్వం అంటే హేళనగా ఉంది. హిందువులంటే చులకనగా ఉంది. భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహఇన్ ఛార్జి సునిల్ డియోధర్ శ్రీవారిని దర్శించుకుని నామాలు పెట్టుకుంటే రాష్ట్ర మంత్రి హేళన చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి తిరుమల ఆలయం ముందు నిలుచుని క్రిస్మస్ శుభాకాంక్షలు చెబితే ముఖ్యమంత్రికి ఆనందం. వైకాపా పార్లమెంటు అభ్యర్థి చర్చికి వెళ్లి ప్రార్ధనలు చేయించుకుంటే ఫాస్టర్ ఫేస్ బుక్ లో పెట్టి వెంటనే తీసేశారు.

ఎందుకంత భయం. మాకు క్రైస్తవం అంటే వ్యతిరేకత లేదు. గూడూరు ఎమ్మెల్యే సిలువను మోశారు బయట హిందువులగా చెప్పుకుని క్రైస్తవం ఆచరిస్తున్న ఎందరో మంత్రులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. వారి చరిత్ర మాకు తెలుసు. ఈ దంద్వవైఖరిపై ముఖ్యమంత్రి జగన్ తన అభిప్రాయం ప్రజలకు వెల్లడించాలి.

ఆలయాలపై దాడులు చేస్తుంటే ఆయన మాట్లాడరు. రాముడి విగ్రహానికి శిరచ్చేదం చేస్తే స్పందించరు. హిందూత్వం అంటే హేళనగా ఉ ంది. ఆలయాల ధ్వంసం చేసిన నేరస్తులను ఇంత వరకు ఎందుకు పట్టుకోలేదు. అన్యమతస్తులకు హిందూఎస్సీ స్థానాల్లో టిక్కెట్లు ఇవ్వడం వల్ల హిందూ సోదరులకు అన్యాయం జరుగుతుంది.

శ్రీశైలంలో పెద్దఎత్తున అన్యమతస్తులున్నారు. వారికి ఉండేందుకు భూములు, పట్టాలు, ఓట్లు యిచ్చారు. చర్చిలకు వెళ్లి హిందూపండుగలకు శుభాకాంక్షలు చెప్పగలరా? రాజ్యాంగానికి విరుద్ధంగా క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించలేదా? ఇలాంటి మతతత్వ పోకడల్ని భాజపా తీవ్రంగా ఖండిస్తుంది. మేం ఇంగ్లీషు భాషకు వ్యతిరేకం కాదు. తెలుగుభాషను తొలగించకుండా ప్రత్యేకంగా ఇంగ్లీషు మీడియం పాఠశాలలు నిర్మించాలి.

యుపీలో కొత్తగా 5 వేల ఇంగ్లీషుమీడియం పాఠశాలలు నిర్మించారు. రాయలసీమ ప్రాజెక్టులు, వెనుకబాటుతనం, హిందుత్వంపై జరుగుతున్న దాడులపై చర్చజరగాలి. అనంతరం మీడియా సిబ్బందితో ఉగాది వేడుకలు నిర్వహించారు. మీడియా సమావేశంలో అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, సీనియర్ నాయకులు సుదీష్ రాంభొట్ల పాల్గొన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు