ప్రజాధనం ఆదా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రివర్స్ టెండరింగ్ వల్ల సివిల్ సప్లయిస్ డోర్ డెలివరీ వాహనాల కొనుగోళ్ళలో సుమారు రూ.63 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులను ప్రజల ఇళ్ల వద్దకు తీసుకువెళ్ళి, అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు సివిల్ సప్లయిస్ 9260 డోర్ డెలివరీ వాహనాలను కొనుగోలు టెండర్లను ఆహ్వానించింది. టెండర్లలో సుజుకీ, టాటామోటార్స్ వంటి సంస్థలు బిడ్‌లను దాఖలు చేశాయి. ఈ బిడ్‌లపై గత రెండు వారాల కిందటే జ్యుడీషయల్ ప్రివ్యూ కూడా పూర్తయ్యింది.
ప్రారంభంలో ఒక్కో వాహనానికి రూ.6.60 లక్షలు కోట్ చేసిన టాటా మోటార్స్ రివర్స్ బిడ్డింగ్ లో రూ. 5,72,539 లక్షలకు రేట్‌ను తగ్గించుకుంది.