వివరాల్లోకి వెళితే.. గురువారం అర్థరాత్రి చిలకలూరిపేటలో వుంటున్న ఏడు నెలల గర్భిణికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దాంతో ఆ బాధ ఎందుకనో అనే ఆందోళనతో అర్థరాత్రివేళ తన భర్తను తీసుకుని సమీపంలోని ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు మందులు రాశాడు. ఆ మందులను తీసుకురావాల్సిందిగా భర్తను మందుల దుకాణానికి పంపించాడు.