చిరంజీవితో ఇంటర్వ్యూ: రోజాను పార్టీకి-ఛానెల్‌కి వాడుకున్న జగన్.. రేటింగ్ పెరిగిందా?

బుధవారం, 11 జనవరి 2017 (18:44 IST)
మెగాస్టార్ చిరంజీవితో సీనియర్ హీరోయిన్ రోజా ఇంటర్వ్యూ ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది. రోజా ప్రస్తుతం ఎమ్మెల్యేగా వైకాపా కోసం బాగానే కష్టపడుతున్నారు. సహజంగా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వున్న రోజా, విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. ఎవరినైనా తిట్టాలంటే పార్టీ నాయకుడు జగన్.. రోజాకే ఆ భాద్యత అప్పగిస్తుంటారు. 
 
ప్రస్తుతం జగన్ రోజాకు సాక్షి ఛానల్లో జర్నలిస్ట్ జాబ్‌ను ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవిని స్పెషల్‌గా ఇంటర్వ్యూ చేశారు. చిరంజీవి ఇప్పుడు వెండితెర రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అన్నీ మీడియా ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. చిరంజీవిని ఇంటర్వ్యూతో రోజా ఇమేజ్ పెరిగిపోయింది. వైసీపీ ఎమ్మెల్యే అయిన రోజా ఒకప్పుడు చిరంజీవి రోజా కలిసి నటించారు.
 
రాజకీయాల్లోకి వచ్చేసరికి వీరి మధ్య గ్యాప్ వచ్చింది. వీలు కుదిరినప్పుడల్లా చిరంజీవిపై నోరు పారేసుకున్నారు రోజా. ఇప్పటికీ విమర్శిస్తునే వుంటారు. అలాంటి రోజా ఈ ఇంటర్వ్యూ చేయడం ఆసక్తిగా మారింది. రోజా సరదా పడ్డారో, లేదా ఛానల్ వాళ్ళ క్రియేటివిటో గానీ అన్నీ అన్ని ఇంటర్వ్యూల కంటే సాక్షి ఛానల్‌లో వచ్చిన ఇంటర్వ్యూకు భారీ రేటింగ్ వచ్చింది. దీంతో టీఆర్పీ రేటింగ్ వచ్చిందని టాలీవుడ్‌లో టాక్ వస్తోంది. మొత్తానికి రోజాను జగన్మోహన్ రెడ్డి తెగ వాడుకున్నారని సినీ పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి