చంటిబిడ్డలను చంకనేసుకుని ముద్దుముద్దుగా ఆడించిన రోజా?

బుధవారం, 9 సెప్టెంబరు 2020 (21:38 IST)
యే.. రౌడీ పిల్ల.. ఇంద ఇవి తీసుకో. నువ్వు ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు ఇవి నీకు ఉపయోగపడుతాయంటూ ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా చిన్నపిల్లలతో ముద్దుముద్దుగా మాట్లాడారు. ప్రభుత్వం తరపున వారికి పోషకాహారాలను అందజేశారు.
 
చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం కాయం గ్రామంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. ఈ సందర్భంగా ఆమె చిన్నారులను చంకనేసుకుని వారితో తమాషాగా మాట్లాడుతూ కనిపించారు. ముద్దుముద్దుగా కనిపిస్తున్న పిల్లలను పైకెత్తుకుని కాసేపు ఆడించారు.
 
రాష్ట్రప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రోజా చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల సంరక్షణే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంపూర్ణ పోషణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు