గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడిపడితే అక్కడ కోడి పందాల బరులు వెలిశాయి. పోలీసులు ముందు హూంకరించినా, తర్వాత వదిలేసినట్లు కనిపిస్తోంది. పైగా ఎక్కడపడితే అక్కడ అధికార వైసీపీ నేతలు దగ్గరుండి సంక్రాంతి సంబరాలు జరిపిస్తున్నారు. తగ్గేదేలా అంటూ, బరులు గీసి కోడి పందాలు, పేకాట, గుండాట, జూదం నడిపించేస్తున్నారు.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో యద్దేచగా కోడిపందాలు, జూదం, మద్యం ప్రవహిస్తున్నాయి. వైసిపి నేతల అండతో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పోలీసులకు ముడుపులు ఇచ్చాం...ప్రభుత్వం మాది అంటున్నారు వైసిపి నేతలు. అందుకే, ఎవరూ వచ్చినా తగ్గేదెలా అంటున్నారు పందెంరాయుళ్లు.
ఇక హైటెక్ పద్ధతుల్లో కోడి పందాలు వీక్షించేందుకు సీసీ కెమెరాలు, టీవీలు కూడా ఏర్పాటు చేసి, ఇబ్రహీంపట్నం పందెం రాయళ్ళు సందడి చేస్తున్నారు. ఇంత హైటెక్ పద్ధతుల్లో కోడి పందాలు వేస్తున్నా, బహిరంగంగా గుండాట, పేకాటలు ఆడుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.