బ్యూటీపార్లర్‌లో వ్యభిచారం- మహిళల అరెస్ట్.. వాట్సాప్ ద్వారా?

శుక్రవారం, 9 నవంబరు 2018 (13:51 IST)
విజయవాడలో వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. విజయవాడ నగరం మొగల్రాజపురం రెవెన్యూ కాలనీలో నెలరోజుల క్రితం నుంచి నోవెల్‌ బ్యూటీపార్లర్‌ నడుస్తోంది. ఈ బ్యూటీపార్లర్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందడంతో పోలీసులు అలర్టయ్యారు. అదను చూసుకుని పార్లర్‌పై దాడి చేశారు. 
 
నిర్వాహకురాలు కాకర్ల నందినిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు గుట్టు రట్టయింది. నెలరోజుల క్రితం ప్రారంభించిన ఈ బ్యూటీపార్లర్‌లో వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు నందినితో పాటు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు