పవర్ స్టార్ అనే పేరిట కోలీవుడ్‌లో పేరు కొట్టేసిన ఎస్. శ్రీనివాసన్ అరెస్టయ్యాడు. సహాయక పాత్రలు, కామెడీ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే పవర్ స్టార్ ప్రస్తుతం బడా మోసం కేసులో అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ పోలీసులు పవర్ స్టార్‌ను అరెస్టు చేశారు. రూ.1000 కోట్లు రుణం ఇప్పిస్తానని చెప్పి.. ఓ సంస్థ నుంచి సుమారు రూ.5 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.