విజయనగరం జిల్లా మోదవలస రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్శిటీ జాయింట్ డైరెక్టర్ ప్రసన్నబాబు పైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వర్సిటీలోని తమ పిల్లలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
అతను ఓ అమ్మాయిని మీ తండ్రి పిలుస్తున్నాడని చెప్పి తన పర్సనల్ గదికి తీసుకు వెళ్లి, గట్టిగా హత్తుకున్నాడని, ఆమె వదలమని దండం పెట్టి బతిమాలిందని చెబుతున్నారు. ఇరవై మందికి పైగా అతని బాధితులు ఉన్నారని అంటున్నారు. పది మందికి పైగా బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారని ఎస్పీకి బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.