హైదరాబాదులో షబ్బీర్ అలీ మాట్లాడుతూ, విదేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాలు రాక్ సింగర్‌ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. క్షణానికో డ్రెస్సు మారుస్తున్న మోడీ.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా విదేశీ పర్యటనకు వెళ్లారా? లేక దేశ ప్రధానిగా వెళ్లారా? అని ఆయన నిలదీశారు. వివిధ దేశాల్లో పర్యటిస్తున్న మోడీ, ఆయా దేశాల్లోని దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. 'డియర్ బరాక్ ఒబామా ధ్యాంక్స్...మీ మాటలు నన్ను ఎంతో ఉత్సాహపరచాయి' అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఓ పత్రికకు ఆర్టికల్ రాసిన ఒబామా, చాయ్ వాలా స్థాయి నుంచి ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఎన్నికైన మోడీ ఆధ్వర్యంలో భారత్ ప్రగతి పథాన పయనిస్తుందని పేర్కొన్నారు.