ఇంద్రకీలాద్రిపై 22 నుంచి శాకంబరీ ఉత్సవాలు

మంగళవారం, 6 జులై 2021 (09:45 IST)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 వ తేదీ నుంచి మూడు రోజులపాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. కూరగాయలతో‌ చేసిన అలంకారంతో మూడు రోజులపాటు దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని దుర్గగుడి పాలకమండలి, అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

దాతలు, రైతులు, వ్యాపార వర్గాల నుంచి అవసరమైన కూరగాయలు, పండ్లు సేకరిస్తున్నారు. ఈ నెల 18 న తెలంగాణ రాష్ట్రం నుంచి దుర్గమ్మకు భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోణం సమర్పించనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు