వివాదాస్ప‌ద నూజివీడు డివిజన్‌లో భూముల రీసర్వేలో మాధవీలత

సోమవారం, 5 జులై 2021 (21:47 IST)
Madhavi Latha
జ‌మీందారు భూములు అధికంగా ఉండి, వివాదాస్ప‌దంగా మారిన నూజివీడు డివిజన్‌లో భూముల రీసర్వే కార్యక్ర‌మంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్ట‌ర్ కె. మాధవీలత పాల్గొన్నారు. నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో భూముల రీసర్వే పనులను ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జగనన్న శాశ్వత భూ హక్కు పథ‌కం కింద చేపట్టిన భూ సర్వే పనులు పూర్తి పారదర్శకంగా చేపట్టాలన్నారు. 
 
భూ సర్వే పనులు, వేగవంతంగా పూర్తి చేసేందుకు ఆధునిక జీ. పి .ఎస్. యంత్రాలు, డ్రోన్లు, లాప్ టాప్ వంటి ఆధునిక పరికరాలను అందించామన్నారు. ఆధునిక యంత్రాలపై సర్వేయర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చామ‌న్నారు. ప్రస్తుతం చేపడుతున్న భూముల  రీ సర్వే తో  జాయింట్ కుటుంబాలు, విభజన కానీ ఆస్తులకు సంబంధించి భూముల సర్వే లకు సంబందించిన సమస్యలు తొలగుతాయన్నారు. 
 
అనంతరం గొల్లపల్లి గ్రామంలోని గ్రామ సచివాలయాన్నిజేసీ సందర్శించి, ప్రజలకు అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించారు. సచివాలయానికి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలు, సచివాలయం ద్వారా అందుతున్న సేవలపై వారి అభిప్రాయాలను జాయింట్ కలెక్టర్ డా. మాధవీలత అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ వెంట ఇంచార్జి ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి, తహసీల్దార్ ఎం. సురేష్ కుమార్, ఎంపిడిఓ జి. రాణీ, రెవిన్యూ, సర్వే శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు