చెైనీయుల్లో చాలామంది పాములు, కప్పలు తింటారని చెప్పుకుంటూ వుంటారు. అందులో వాస్తవం ఎంత వున్నదో తెలియదు కానీ 21 ఏళ్ల చైనా మహిళ మాత్రం తను ఓ స్నేక్ వైన్ తాగాలని అనుకుంది. ఈ స్నేక్ వైన్ తాగితే తనకు ఉత్తేజం వస్తుందని భావించిన సదరు మహిళ విషపూరిత పాము కోసం ఆన్లైల్లో బుక్ చేసింది. ఆర్డర్ తీసుకున్న సదరు పోర్టల్ అత్యంత విషపూరితమైన పామును పట్టి ఆమెకు కొరియర్ ద్వారా పంపింది.
బాక్సులో పామును జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్లి ఆ పామును వైన్లో వేయబోయింది సదరు మహిళ. ఐతే ఆ పాము కాస్తా ఆమెను కాటేసి అక్కడి నుంచి తప్పించుకుంది. భయంకరమైన విషపాము కావడంతో అది కరిచిన వెంటనే ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. కాగా పామును బాక్సులో తెచ్చిన కొరియర్ కంపెనీ, అందులో పాము వున్న సంగతి తమకు తెలియదని వెల్లడించింది.
కాగా తన కుమార్తె కేవలం సాంప్రదాయ ఔషధ గుణాలున్న వైన్ తయారుచేయాలని భావించిందనీ, దాన్ని చేసే క్రమంలో పాము కాటుకు గురై మరణించిందని పేర్కొంది. పాములను ఇలా ఆల్కహాల్‌లో వేసి వైన్‌ను తయారుచేసేందుకు వణ్యప్రాణులను ఇలా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టడం చైనాలో నిషిద్ధం. ఇలాంటి సైట్లను చైనా నిషేధించినా దొంగచాటుగా కొన్ని వెబ్ సైట్లు ఈ కార్యాన్ని నిర్వహిస్తూనే వున్నాయి.