నటి జయసుధ చెప్పిన మాట విని అడిగిన విలేకరి షాక్ తిన్నాడు. ఇంతకీ ఏంటా సంగతయ్యా అంటే, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పేరు ఆమె ఇప్పటివరకూ విన్లేదట. అసలలాంటి పార్టీ ఒకటి ఉందా అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారట. అంతేకాదు... తనకు జనసేన పార్టీ పేరు కంటే పవన్ కళ్యాణ్ పార్టీ అని మాత్రమే తెలుసునని చెప్పుకొచ్చిందట.
అదిసరే... తెలుగుదేశం పార్టీని వదిలేసి ప్రత్యేక హోదా కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతారా అని ప్రశ్నిస్తే.... అబ్బే అదేం లేదు... నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతా అంటూ సమాధానమిచ్చారట జయసుధ. గతంలో వైఎస్సార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జయసుధ ప్రస్తుతం రాజకీయాల్లో మౌనముద్రను దాల్చారు. మరి తెలుగుదేశం పార్టీలోకి చేరినప్పటికీ ఆ పార్టీ నుంచి ఎలాంటి పదవులను ఆమె ఆశించలేదు. ఈ నేపధ్యంలో రాబోయే ఎన్నికల్లో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది.