ఈ మేరకు వైఎసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. కర్నూలు జిల్లా నేతలతో పాటు పార్టీకి చెందిన సీనియర్ నేతలతో జరిపిన చర్చల అనంతరం వైకాపా అధినేత జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో వైసీసీ అభ్యర్థిగాశిల్పా మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నామని, అంతేకాకుండా, నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగానూ ఆయన్నినియమించామని జగన్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, ఈ స్థానం నుంచి టీడీపీ తరపున భూమా కుటుంబ సభ్యులు లేదా బలమైన ప్రత్యర్థిని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బరిలోకి దించే అవకాశం ఉంది. వైకాపా శిల్పా మోహన్ రెడ్డిని బరిలోకి దించడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది.