శిరీషతో ఎంజాయ్ చేస్తా.. మీరు సెక్స్ వర్కర్లతో ఉండండి.. వారిద్దరితో చెప్పిన ఎస్ఐ

మంగళవారం, 20 జూన్ 2017 (10:57 IST)
హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య, కూకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ కేసులో సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సమస్య పరిష్కారం కోసం ఎస్ఐ దగ్గరకు వెళ్లిన శరీషకు... పోలీస్ క్వార్టర్స్‌లో తాను ఊహించని సంఘటన ఎదురైంది. ఆ ఒక్క సంఘటనతోనే ఆమె ఇక జీవించకూడదన్న నిర్ణయానికి వచ్చి హైదరాబాద్ ఆర్జే ఫోటో స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడింది. 
 
అంతకుముందు కూకునూరుపల్లి పోలీసు క్వార్టర్స్‌లో జరిగిన విషయాలను పోలీసులు పూసగుచ్చినట్టు పోలీసు డైరీలో పేర్కొని కోర్టుకు సమర్పించారు. కూకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లిన శిరీష, రాజీవ్, శ్రవణ్‌లు కలిసి మద్యం సేవించారు. రెండు రౌండ్లు పూర్తయ్యాక... 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యభిచారగృహాలకు వెళ్లి ఎంజాయ్ చేసి రావాలని రాజీవ్, శ్రవణ్‌లకు ఎస్ఐ చెప్పాడు. వీరితో పాటు శిరీష కూడా బయటకు వెళ్లేందుకు వచ్చింది.
 
అపుడు శిరీషను ఎస్ఐ గద్దించడంతో గదిలోనే ఉండిపోయింది. ఆ తర్వాత మళ్లీ నలుగురు కలిసి మరోమారు మద్యం సేవించారు. పిమ్మట సిగరెట్ తాగేందుకు రాజీవ్, శ్రవణ్‌లు బయటకు రాగా, వారిద్దరినీ వ్యభిచారిణుల వద్దకు వెళ్లాలని ఎస్ఐ ఒత్తిడి తెచ్చాడు. దీంతో వారిద్దరు బయటకు వెళ్లడంతో శిరీష్‌ వద్దకు వెళ్లిన ఎస్ఐ ఆమెను బలవంతంగా దగ్గరకు తీసుకుని కౌగిలించుకునేందుకు యత్నించాడు. దీనికి ఆమె ప్రతిఘటించడమే కాకుండా, బిగ్గరగా కేకలు వేసింది. 
 
తాను సమస్య పరిష్కారం కోసం వస్తే ఇక్కడ మరోలా జరుగుతుందని భావించిన శిరీష.. తన భర్తకు తానున్న లొకేషన్‌ను 2 సార్లు షేర్ చేసింది. అలాగే, రాజీవ్‌కు వాట్సాప్ సందేశం పెట్టి తనను ఒంటరిగా వదలి వెళ్లొద్దంటూ ప్రాధేయపడింది. ఆ తర్వాత గదిలో బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు క్వార్టర్స్‌లోని ఇతరులకు వినిపిస్తుందని భావించిన ఎస్ఐ.. రాజీవ్, శ్రవణ్‌లకు ఫోన్ చేసి తక్షణం వచ్చి శిరీష‌ను తీసుకెళ్లాల్సిందిగా కోరాడు. 
 
దీంతో వారిద్దరు వ్యభిచార గృహాలకు వెళ్లకుండానే తిరిగివచ్చి శిరీషను తీసుకుని హైదరాబాద్‌కు వచ్చారు. అంటే శిరీష ఆత్మహత్య కేసులో ప్రధాన ముద్దాయి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి. అందువల్లే అతను శిరీష ఆత్మహత్య చేసుకుందని తెలిసినవెంటనే తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయినట్టు పోలీసు డైరీలో స్పష్టంగా పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి