ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తుంటే శివాజీగాడు ఎవడు? వాడిది ఏ కులం? అని ప్రశ్నిస్తున్నారట

గురువారం, 15 సెప్టెంబరు 2016 (13:40 IST)
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లాభం లేదని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ చెప్తున్న కేంద్రంపై ఇప్పటికే ప్రజలు గుర్రుగా ఉన్నారు. హోదా కోసం మభ్యపెడుతూ.. అన్నీ అబద్ధాలు చెప్తూ.. హోదా వస్తే పరిశ్రమలు రావని, ఇంకా హోదా అడిగితే ఇతర రాష్ట్రాలకు లింకు పెట్టడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హోదాపై పోరాడుతున్న ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ.. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతుంటే శివాజీగాడు ఎవ‌డు? వాడిది ఏ కులం? అని కొందరు ప్ర‌శ్నిస్తున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రత్యేక హోదా విషయంలో ఇంకెన్ని రోజులు ప్రజలను మభ్యపెడతారని అడిగారు. రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా ప్రత్యేక హోదాని వదులుకుంటారా? అంటూ శివాజీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన బెట్టి కులాన్ని పట్టుకుని ఊగులాడటం ఏమిటని.. తానే కులమో ఇప్పుడు అవసరమా అంటూ అడిగారు. జనసేన అధినేత పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి వారు హోదాపై అడిగిన‌ప్పుడు ఎందుకు వీరు అస‌హ‌నానికి గుర‌వుతున్నార‌ని మండిపడ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి వారు హోదా కోసం పోరాడాల్సిన అవసరం వుందని శివాజీ అన్నారు.

వెబ్దునియా పై చదవండి