ఒక వాటర్‌ బాటిల్‌లోకి దూరిన నాగుపాము.. పడగవిప్పి చూస్తూ..

శనివారం, 27 జూన్ 2020 (13:47 IST)
ఒక వాటర్‌ బాటిల్‌లోకి దూరిన ఆ పాము పిల్ల బయటకొచ్చేందుకు అష్టకష్టాలు పడుతూ.. పడగ విప్పి చూసింది. అంత చిన్న పాము పిల్ల పడగ విప్పి చూసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి, ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ తూర్పు ప్రాంతంలోని జంటగోపురాల వద్ద చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం తాచుపాము పిల్ల కొద్దిసేపు హల్‌చల్‌ చేసింది. 
 
అంత చిన్న పాము పిల్ల పడగ విప్పి చూస్తుండటాన్ని అక్కడున్న భక్తులంతా ఆసక్తిగా తిలకించారు. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఒక హోంగార్డు ధైర్యం చేసి ఆ బాటిల్‌కు మూతపెట్టి, పాము పిల్లను బందీ చేశాడు. అనంతరం కొండపైకి దూరంగా తీసుకెళ్లి పొదల్లో విడిచిపెట్టాడు. వాటర్ బాటిల్‌లోకి వెళ్లిన నాగుపాము పిల్లకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు