టెక్కీ భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య

సోమవారం, 1 జులై 2019 (11:28 IST)
ఇటీవల కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన హత్య కేసులోని మిస్టరీ వీడిపోయింది. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న యువతి... తన ప్రియుడుతో కలిసి టెక్కీ భర్తను హత్య చేసింది. దీనిపై స్థానిక పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు గుట్టు బహిర్గతమైంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రైల్వే కోడూరుకు చెందిన షబ్నా అనే యువతికి అబ్దుల్ ఖాదర్ అనే టెక్కీతో పెద్దలు పెళ్లి చేశారు. అయితే, షబ్నాకు అప్పటికే ప్రిన్స్ అనే ప్రియుడుతో శారీరక సంబంధం కూడా ఉంది. దీంతో ఖాదర్‌తో పెళ్లి ఇష్టంలేదు. ఈ విషయాన్ని తన ప్రియుడు ప్రిన్స్‌కు చెప్పింది. వారిద్దరూ కలిసి కిరాయి ముఠా సభ్యులతో కలిసి నడిరోడ్డుపై దారుణంగా హత్య చేయించారు. 
 
ఈ కేసులో భార్య షహ్నాతో పాటు... ప్రిన్స్, అతనికి సహకరించిన దీనదయాళ్ బాబు, సెల్వందేవ్‌ అనే కిరాయి ముఠా సభ్యులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఖాదర్‌తో పెళ్లి తనకు ఏమాత్రం ఇష్టంలేదనీ, ఈ విషయాన్ని తల్లిదండ్రులతో పాటు.. అత్తమామలకు చెప్పినా వారు వినిపించుకోకుండా తనకు అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం చేశారని అందుకే హత్య చేయించినట్టు నిందితురాలు షబ్నా వాంగ్మూలం ఇచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు