గ్రామీణ వైద్యుల సమస్యల్ని పరిష్కరిస్తా: మంత్రి వెల్లంపల్లి

మంగళవారం, 2 జూన్ 2020 (20:28 IST)
గ్రామీణ వైద్యులకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులను తెరుచుకునే అవకాశం కల్పించాలని కోరుతూ బీహెచ్ఎంపీ, ఆర్ఎంపీడబ్లూఏ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు.

కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో తమ వైద్యశాలలను మూసివేశామని ఇప్పుడు వాటిని తెరుచుకునే అవకాశం కల్పించమని కోరుతూ మంత్రికి ఓ వినతిపత్రం అందజేశారు.

మంగళవారం మంత్రి స్వగృహంలోని ఆఫీస్ లో ఆయనను కలిసిన వారిలో బీహెచ్ఎంపీ, ఆర్ఎంపీడబ్లూఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగిపోగు వెంకటేశ్వరరావు, బిహెఎంపి జిల్లా కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు, కోశాధికారి కిషోర్, మహిళా అధ్యక్షురాలు పి. కనక రత్నం, ఉపాధ్యక్షులు పీ మోహనరావు, జిల్లా అధ్యక్షులు సీహెచ్ ఉమామహేశ్వరరావులు ఉన్నారు.

గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్న ఇంకా పలు సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని వారు మంత్రిని కోరగా ఈ విషయమై సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు