గోదావరి వంతెనపై వెళ్లే రైళ్ల వేగం పెంపు

గురువారం, 28 జులై 2022 (12:42 IST)
రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న వంతెనపై వెళ్లే రైళ్ల వేగాన్ని పెంచారు. ఈ వంతెనపై ఉన్న రైల్వే ట్రాక్ పట్టాల కింద ఉండే స్లీపర్లను అధికారులు పూర్తిగా మార్చేశారు. దీంతోపాటు ట్రాక్‌ను మరింత పటిష్టం చేశారు. ఫలితంగా ఈ వంతెనపై వెళ్లే అన్ని రైళ్ల రాకపోకల వేగాన్ని పెంచారు. 
 
కాగా, రాజమండ్రి వద్ద గోదావరి నదిపై 2.9 కిలోమీటర్ల మేరకు రైలు వంతెన ఉంది. ఈ వంతెనపై గంటకు 30 కిలోమీటర్ల వేగంతోనే రైళ్ళు ప్రయాణించాల్సి ఉంది. కానీ, ఇపుడు రైలు పట్టాల కింద ఉన్న స్లీపర్స్‌ను మార్చడంతో పాటు వంతెనను మరింత పటిష్టం చేశారు. 
 
ఫలితంగా ఈ వంతెనపై రైళ్ళు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేందుకు గత ఏప్రిల్ నెలలోనే అధికారులు అనుమతి ఇచ్చారు. ఇపుడు ఆ వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచారు. రైళ్ల వేగం పెంచడం ద్వారా రద్దీ తగ్గుతుందని, సమయపాలన పెరుగుతుందని రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు