ఇందులో సినిమా టిక్కెట్లు, థియేటర్‌లో చిరుతిళ్ల ధరలు, భారీ బడ్జెట్ చిత్రాలకు సంబంధించి టిక్కెట్ ధరలపై చర్చించారు. ఈ భేటీ ముగిసిన తర్వాత పలువురు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. "అటు ప్రజలు, ఇటు సినీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాలకు మేలు చేకూరేలా సినిమా టిక్కెట్ ధరలపై ప్రభుత్వానికి ఒక నివేదికను తయారు చేసి సమర్పించనున్నాం. ప్రభుత్వం ఎలాంటి ధరను ఫిక్స్ చేస్తుందో వేచి చూడాల్సివుందన్నారు.
అతి త్వరలోనే ప్రభుత్వం టిక్కెట్ ధరలపై సానుకూ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. టిక్కెట ధరల విషయంపై తెలుగు ఫిలిమ్ చాంబర్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ప్రజలు, సినీ పరిశ్రమను సంతృప్తి పరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం అని వెల్లడించారు.