వైసిపి మాజీమంత్రి విడదల రజినీని బూతులు తిడుతున్న శ్రీరెడ్డి

ఐవీఆర్

సోమవారం, 10 జూన్ 2024 (20:09 IST)
కర్టెసి-ట్విట్టర్
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సిపి ఓడిపోయిన దగ్గర్నుంచి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో రోజుకో నాయకుడు/నాయకురాలుని టార్గెట్ చేస్తోంది. తాజాగా మాజీమంత్రి విడదల రజినీని అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్ట్ పెట్టింది. ఇప్పటివరకూ తెదేపా, జనసేన నాయకులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టే శ్రీరెడ్డి ఒక్కసారిగా వైసిపి నాయకురాలినే టార్గెట్ చేయడంతో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు అవాక్కవుతున్నారు. విడదల రజినీ వల్లనే వైసిపి ఓడిపోయిందని, ఈమెను జగన్ మోహన్ రెడ్డి వెంటేసుకుని తప్పు చేసారంటూ కామెంట్ చేసింది.
 

E sani mundani pakkanesukuni thiragam valana tdp srenulni rechagotti gelupu kosam pani cheyincharani dial news youtube lo chupincharu..ee vishayam nenu yeppudo cheppa..e chetha munda manakodhani pic.twitter.com/h32llx50IS

— Sri Reddy (@SriReddyTalks) June 10, 2024
తెదేపా వాళ్లు నన్ను లోపల ఏసేస్తారు 
సోషల్ మీడియాలో నిత్యం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలను దుమ్మెత్తిపోతే శ్రీరెడ్డి ఒక్కసారిగా వైసిపిపై రివర్స్ అయ్యింది. ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్లు మాట్లాడింది. జగన్ పార్టీ పెట్టినప్పట్నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డానని చెప్పుకొచ్చింది. అలాంటిది కార్యకర్తలను తెదేపా వాళ్లు దాడి చేస్తుంటే వైసిపి చేతులెత్తేస్తోందని మండిపడింది.
 
తెలుగుదేశం పార్టీ వాళ్లకి వున్న టెక్నాలజీతో నన్ను ఏదో ఒకనాడు పట్టుకుని లోపల ఏసేస్తారు. అప్పుడు నన్ను వైసిపికి చెందిన అమ్మాయిగా మీరు చెప్తారా... చెప్పకుండా చేతులెత్తేస్తారా? నేను ఏడిస్తే వైసిపి పరువు పోతుందని ఈరోజుకి కూడా ధైర్యంగా మాట్లాడుతున్నా... నాయకులు ఎవ్వరూ కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు అంటూ నిలదీశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు