అన్ని ఆలయాలు తెరుచుకున్నాయి, కానీ ఆ ఒక్క ఆలయం తప్ప

సోమవారం, 8 జూన్ 2020 (18:43 IST)
వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంను అధికారులు తెరవలేదు. ఆలయం కరోనా వైరస్ ప్రభావిత జోన్‌లో ఉన్న నేపథ్యంలో ఆలయాన్ని మూసే ఉంచారు. ఉదయం నుంచి అన్ని ఆలయాలు తెరుచుకుంటూ వచ్చారు. భక్తులను ఆలయానికి అనుమతిస్తూ వచ్చారు. అయితే శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం మూసే ఉంచారు.
 
శ్రీకాళహస్తిలో కేసులు ఎక్కువగా ఉండటంతో గత నాలుగు రోజుల నుంచి శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరకూడదని దేవదాయశాఖ ఆదేశాలిచ్చింది. దీంతో శ్రీకాళహస్తి అధికారులు ఆలయంలో దర్సనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు కానీ చివరి నిమిషంలో ఉత్తర్వులు రావడంతో వెనక్కి తగ్గారు.
 
అయితే త్వరలోనే శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరుస్తామని.. భక్తులను దర్సనానికి అనుమతిస్తామంటున్నారు దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ రెడ్డి. అన్ని ఆలయాలు తెరుచుకుని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరుచుకోకపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కొంతమంది స్థానికులు ఆలయ పరిసర ప్రాంతాలకు వచ్చి స్వామి ఎప్పుడు కరుణిస్తావు అంటూ రెండు చేతులెత్తి దంణ్ణం పెడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు