ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఆయా బస్సుల్లో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయని ఏపిఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ ఠాకూర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు చేసింది. తిరుమల బస్‌స్టేషన్ చేరుకున్న అనంతరం శీఘ్ర దర్శనం చేసుకునేందుకు ప్రయాణికులకు ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయసహకారాలు అందిస్తారు.
ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం విచ్చేసే ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యంగా ఉంటుంది.