గ‌న్న‌వ‌రంలో క‌రోనా వ్యాక్సిన్ వికటించి వ్యక్తి మృతి, అనాధ‌గా 6నెల‌ల ప‌సికందు!

బుధవారం, 1 సెప్టెంబరు 2021 (10:40 IST)
కృష్ణాజిల్లా గన్నవరంలో కరోనా వ్యాక్సిన్ వికటించి మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30) అనే వ్య‌క్తి మృతి చెందాడు. నిన్న సాయంత్రం గన్నవరం పంచాయతీలో సుభాని కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. వ్యాక్సిన్ విక‌టించి, నిన్న రాత్రంతా జ్వరం వాంతులు, విరోచనాలు, వచ్చి మృతి చెందినట్లు సుభాని కుటుంబ స‌భ్యులు తెలిపారు.
 
ఎనిమిది నెలల క్రితం సుభాని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఆరు నెలల పిల్లవాడి ఆలనా పాలనా తండ్రిగా సుభానినే చూసుకుంటున్నాడు. ఇపుడు వ్యాక్సిన్ వికటించి సుభాని కూడా మృతి చెందడంతో అనాథ అయిన 6 నెలల పసికందు ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. షేక్ సుభాని తాపీ పని చేస్తూ ఉండేవాడు. ఆయ‌న బిడ్డ‌ను ఆదుకొని, కుటుంబానికి స‌హాయం అందించాల‌ని స్తానికులు డిమాండు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు