ఆంధ్రా కింగ్ తాలూకా లో రామ్ డై-హార్డ్ సినిమా ఫ్యాన్ గా అలరించబోతున్నారు. ఇది ఒక అభిమాని బియోపిక్ గా ఉండబోతోంది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వివేక్ & మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
నవంబర్ 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్