రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. పరిషత్ ఎన్నికల్లో గెలిచిన జనసైనికులకు పవన్‌కల్యాణ్ అభినందనలు తెలిపారు. వైసీపీ నేతల దాష్టీకాలను తట్టుకుని నిలబడ్డారని ఆయన కొనియాడారు.
జరుగుతున్న వరుస ఘటనలపై ఛీఫ్ సెక్రటరీ, ఎన్నికల కమిషనర్, డీజీపీలు స్పందించాలన్నారు. స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేసారు.