ఈ పరిస్థితుల్లో ఆయన బీజేపీతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం అన్నీ చేయాల్సి ఉంటుందని, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల అమలుకు తాము పలు మార్గాల్లో ఒత్తిడి తెస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలగాలో, వాటన్నింటినీ దగ్గర చేస్తామన్నారు.
హోదాపై ఇప్పటికే పలుమార్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులతో మాట్లాడటం జరిగిందని, ప్రధాని నరేంద్ర మోడీని కూడా అభ్యర్థించామనీ తెలిపారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితి ఎలా ఉందన్న విషయమై, ప్రధాని నివేదిక అడిగారని సుజనా తెలిపారు.