పాము తన గుడ్డును తానే తినేసేలా ఏపీలో పరిస్థితులు ఉన్నాయంటూ స్వామి పరిపూర్ణానంద ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుందని చెప్పారు. రాష్ట్రాన్ని ఈ కాలసర్పం చేతిలో నుంచి బయటపడేయాలంటే ఇలాంటి సమాలోచన అనే వేదిక చాలా అవసరం అని ఉద్ఘాటించారు.
ఏ ప్రభుత్వం కూడా మతమార్పిడిలను ఆపాలనే చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆశ్రమాలు, మఠాలు ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రంలో పరాధీనత పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.