సినిమా థియేటర్లకు తాళం వేసే అధికారం తాహసీల్దారుకు లేదు...

మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (12:12 IST)
సినిమా థియేటర్లకు తాళం వేసే అధికారం తాహసీల్దార్లకు లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక తీర్పునిచ్చింది. ఇది ఏపీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బవంటిదే. ఎందుకంటే రాష్ట్రంలోని అనేక థియేటర్లు నిబంధనలు పాటించడం లేదన్న సాకుతో తాహసీల్దారులు ఇష్టానుసారంగా దాడులు చేస్తూ థియేటర్లను మూసివేస్తున్నారు. దీంతో థియేటర్ యజమానాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇలాంటి తరుణంలో ఏపీ హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. ఏపీ సినిమా నియంత్రణ నిబంధనల ప్రకారం లైసెన్సింగ్ అథారిటీ అయిన సంయుక్త కలెక్టర్ అధికారం ఇచ్చిన వ్యక్తికి మాత్రమే థియేటర్‌ను జప్తు చేసే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది.
 
ప్రస్తుతం ఈ వ్యవహారంలో జాయింట్ కలెక్టర్ ఆ అధికారాన్ని తాహసీల్దార్లకు ఇవ్వలేదని పేర్కొంది. అందువల్ల థియేటర్లను సీజ్ చేసే అధికారం వారికి లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్ రాయ్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు