ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యాక సమావేశం చాలా సంతృప్తినిచ్చింది అని చెప్పారు వర్మ. దాంతో సమస్య అంతా సెటిలైపోతుందిలే అనుకున్నారు. కానీ ఆ తర్వాత వర్మ వరసబెట్టి ట్విట్టర్ పేజీని మోత పుట్టిస్తున్నారు. ఒకేరోజు 25 ట్వీట్లు చేసి వణికిస్తున్నారు. సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపుపై వరుస లాజిక్కులు చెప్పారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను i-Phoneతో పోల్చారు. ఐఫోన్ కొనాలంటే లక్షలు ఖర్చవుతుందనీ, దాన్ని నేలకేసి బద్ధలు కొడితే రూ. 1000 కూడా రాదన్నారు. అంటే ఐడియాకి రూ.1,90,000 అన్నమాట. అలాగే పెద్ద సినిమాకి చిన్న సినిమాకి తేడా వుంటుంది. పెద్ద నటుడికీ చిన్న నటుడికీ తేడా వుంటుంది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాను చూడాలంటే కాస్త ఖర్చవుతుంది మరి.