ఏపీ స్పీకర్ తమ్మినేని తీవ్ర అస్వస్థత - కరోనా తిరగబెట్టిందా?

మంగళవారం, 1 జూన్ 2021 (11:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రెండు రోజులుగా  స్పీకర్ జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవలే స్పీకర్ దంపతులకు కరోనా సోకడంతో చికిత్స పొంది కోలుకున్న విషయం తెలిసిందే. 
 
తొలుత తమ్మినేని సీతారాంకు కరోనా వైరస్ సోకింది. ఆతర్వాత సీతారాం కుమారుడుకు కూడా ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ నుంచి వారు కోలుకున్నారు. అదేసమయంలో సీతారాం భార్యకు ఈ వైరస్ సోకింది. కానీ, ఇపుడు ఈ వైరస్ మళ్లీ తిరగబెట్టినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్ర అస్వస్థతకు లోనైన సీతారాంను మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి