వైసీపీకి ఎందుకింత భయం?: చంద్రబాబు

మంగళవారం, 19 నవంబరు 2019 (13:55 IST)
ఏలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను చాలా ఇబ్బందులు పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీకి ఎందుకింత భయమని ప్రశ్నించారు. చింతమనేని ఒంటరి కాదని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం జగన్‌లాగా బాబాయ్‌ను చంపి తప్పించుకోలేదన్నారు. 
 
రూ.43 వేల కోట్లు అవినీతికి పాల్పడి, ప్రతి ఫ్రైడే కోర్టుకు వెళ్ళడంలేదని ప్రశ్నించారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాలో ఎప్పుడూ ఈ పరిస్థితి చూడలేదన్నారు. ఇది పులివెందుల కాదని పశ్చిమగోదావరి జిల్లా అని చెప్పారు. ఇంత అరాచకమైన పాలనా?.. పోలీసులు తీరును ఖండిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
 
టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, తప్పుడు కేసులు పెడితే పోరాడుతామని, ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు. పోలీసులపై కాదని, వైసీపీపైనే తమ పోరాటమని చంద్రబాబు అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు