ఆంధ్రాలో రాజారెడ్డి రాజ్యాంగం : చంద్రబాబు ధ్వజం

గురువారం, 11 జూన్ 2020 (14:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజారెడ్డి రాసిన రాజ్యాంగం అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన రాష్ట్ర ప్రజలకు సుధీర్ఘ బహిరంగ లేఖ రాశారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు. 
 
"తన సొంత 'రాజారెడ్డి రాజ్యాంగం' అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. దేశ చరిత్రలోనే ఇంతటి రాక్షసపాలన, విధ్వంసకాండ ఏ ప్రభుత్వమూ చేయలేదు. 
 
వైసీపీ దుర్మార్గాల వల్ల రాష్ట్రానికి జరిగిన కీడు, ప్రజలకు కలిగిన చేటు గురించి మీ దృష్టికి తెచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నాను. వైసీపీ పాలకుల నైజాన్ని ప్రజలే చక్కదిద్దాలి. న్యాయాన్ని, చట్టాన్నీ కాపాడటంలో, రాజ్యాంగాన్ని రక్షించడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది.
 
ప్రజల ప్రాధమికహక్కుల పరిరక్షణకోసం గత ఏడాదిగా తెలుగుదేశం చేస్తోన్న రాజీలేని పోరాటంలో రాజకీయాలకు అతీతంగా కలిసివచ్చిన వారందరినీ అభినందిస్తున్నాను. ఇకపై కూడా రాష్ట్ర ప్రయోజనాలను, భావితరాల భవిష్యత్తును కాపాడే కృషిలో మీరంతా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. 

 

దేశమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలుచేస్తోంటే, ఏపీలో మాత్రం @ysjagan తన సొంత 'రాజారెడ్డి రాజ్యాంగం' అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. దేశ చరిత్రలోనే ఇంతటి రాక్షసపాలన, విధ్వంసకాండ ఏ ప్రభుత్వమూ చేయలేదు.(1/3) pic.twitter.com/EH1Qdq0I3J

— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 11, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు