తెదేపా కార్యకర్తలను నాయకులను వేధించి, కష్టపెట్టిన వైకాపా నేతలను, అధికారుల పేర్లను నమోదు చేయండని తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాజధాని అమరావతి ఇక్కడే ఉండాలని చేస్తున్న రైతులకు మద్దతు పలకాలని కోరినందుకు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కేసులు పెట్టగా జైలుపాలై విడుదలైన నందిగామకు చెందిన పలువురు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబును కలుసుకున్నారు.
అమరావతి రాజధాని రైతులకు సంఘీభావంగా తమరు నిరసన దీక్షలో పాల్గొన్నప్పుడు నందిగామలో 20 మందిని నిరసనదీక్ష చేశామని తెదేపా కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి వైకాపా నేతలు, పోలీసు అధికారులు తమపై కక్ష గట్టారని తెలిపారు.