ఏవండోయ్ నాని గారూ.. బాబు విడిచేసిన అండర్‌వేర్‌తో సమానం : దివ్యవాణి

మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (11:16 IST)
ఏపీ మంత్రి కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ మహిళా నేత, సినీ నటి దివ్యవాణి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడిచేసిన అండర్‌వేర్‌తో సమానమంటూ మండిపడ్డారు. అంతేకాదు.. ఏవండోయ్ నాని గారూ... చంద్రబాబు ఓ శిఖరం... ఆయనను ఢీకొట్టడం సాధ్యమయ్యే పనికాదు అంటూ దివ్యవాణి చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, 'ఏంటండీ నాని గారూ... ఈ మధ్య పదేపదే పక్క రాష్ట్రం వదిలిపెట్టి వచ్చారు, పక్క రాష్ట్రం వదిలి పెట్టి వచ్చారు.. ఎవరెవరివో కాళ్లు పట్టుకున్నారు అంటున్నారు. మరి మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? కానీ మీ సంగతికి సంబంధించి మా వద్ద మాత్రం ప్రూఫ్స్ ఉన్నాయి. 
 
ప్రధాని మోడీ కాళ్లపై ఎవరు పడ్డారు? కేసీఆర్ కాళ్లపై ఎవరు పడ్డారు? విజయసాయి రెడ్డి దగ్గర్నుంచి కాళ్లపై పడిన అందరి గురించి ఆధారాలు ఉన్నాయి. ఏవండోయ్ నాని గారూ... మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలుస్తోందా? మీరేం మాట్లాడుతున్నారో కూడా తెలియని స్థితిలో పడిపోతున్నారా? ఓహో... త్వరలోనే మంత్రి వర్గ మార్పులు ఉంటాయని జగన్ చెప్పినందుకేనా!' ఇంతలా రెచ్చిపోతున్నారు అంటూ తనదైనశైలిలో ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు