ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్న వైకాపా ఎమ్మెల్యేలు : టీడీపీ

సోమవారం, 31 మే 2021 (16:49 IST)
రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గొప్పవిజయాలేవో సాధించినట్లు నిస్సిగ్గుగా సంబరాలు చేసుకుంటోందని, మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలేమో ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. 
 
ఆయన మాట్లాడిన మాటలను పరిశీలిస్తే, చంద్రబాబు నాయుడి హాయాంలో రాష్ట్రంలో వ్యవసాయరంగంతోపాటు, పారిశ్రామికీకరణ, ఇతర ఆర్థిక వనరుల సృష్టికి రూపకల్పన చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనే ఆర్థిక నేరస్థుడు ముఖ్యమంత్రయ్యాక వాటన్నింటికీ తిలోదకాలు ఇచ్చేశాడు. రాష్ట్రానికి వ్యవసాయమే ప్రధాన ఆదాయవనరుగా మారింది. 
 
అటువంటి పరిస్థితుల్లో గడచిన 24 నెలల్లో రోజురోజుకీ వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. ఒకే అబద్ధాన్ని, పదిమందితో పదిసార్లు చెప్పించడమనే పాలసీని ఈ ప్రభుత్వం బాగా అమలుచేసింది. గోబెల్స్ ప్రచా రాన్ని మించిపోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు వ్యవసాయరంగానికి, రైతులకు సంబంధించి అనేకవాగ్థానాలు ఇచ్చాడు. 
 
పంట వేయకముందే, ప్రతి ఉత్పత్తికి గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పాడు. ఏపంట రైతు వేయాలనుకుంటే, ఏదితనకు గిట్టుబాటయితే, అదే వేసుకోవచ్చన్నాడు. ఆ విధంగా రైతులుపండించిన ఉత్పత్తుల చివరి గింజవరకు తమ ప్రభుత్వమే కొంటుందని కూడా చెప్పాడు. కానీ జగన్ ముఖ్య మంత్రయ్యాక ఏరువాక మొదలు పంటకోసేవరకు అన్నింటిలో రైతులకు దగానే మిగిలింది. తన రెండేళ్లపాలనలో ఏరోజుకూడా ముఖ్యమంత్రి రైతులవద్దకెళ్లి, వారితోమాట్లాడి నేనున్నాను.. మీకు అండగాఉంటాను అనే భరోసా వారికి కల్పించలేకపోయాడు. 
 
అసలు అలాంటి కార్యక్రమం కూడా ఈ ముఖ్యమంత్రి ఒక్కటికూడా చేపట్టలేదు. టీడీపీ ప్రభుత్వంలో ప్రతి రైతుభూమిలో భూసారపరీక్షలుచేయడం, భూమిలోని ధాతులోపాల నివారణకు ఉచితంగా సూక్ష్మపోషకాలు (జింక్ బోరాన్ వంటివి) అందచేయడం జరిగింది. వాటితోపాటు, సకాలంలో సాగునీటిరంగాన్ని అభివృద్ధిచేసి, రైతులకు నీరందించడంకూడా జరిగింది. తద్వారా రాష్ట్రంలో గణనీయంగా వ్యవసాయఉత్పత్తులు పెరిగాయి. 
 
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక భూసారపరీక్షలకు మంగళంపాడా రు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతులకు ఆర్ బీకే లు (రైతుభరోసా కేంద్రాలు)  సర్వరోగనివారిణిలా పనిచేస్తాయన్నారు. అవిఅలంకారప్రాయంగామారి, కేవలం వైసీపీనేతలు, కార్యకర్తలకు సంపాదన కేంద్రాలుగా మారిపోయాయి, రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఏవీ లభించవు. 
 
జగన్మోహన్ రెడ్డికి ముడుపులు చెల్లించే కంపెనీలకు సంబంధించిన పురుగుమందు లు మాత్రమే అక్కడుంటాయి. అవి పైరుకి ఏమాత్రం ఉపయోగపడవు. రైతులు తమకు ఈ ఎరువు కావాలంటే అది ఆర్ బీకే ల్లో దొర కదు. ఆర్ బీకే కేంద్రాలను వైసీపీ వారికి ఉపాధి కేంద్రాలుగా మార్చి నప్రభుత్వం, నిలువునా రైతులను దగాచేసింది. వీటన్నింటిని తట్టుకొని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయంఅందకపోయినా చచ్చీచెడీ రైతుపంటపండిస్తే, అదిచేతికందే సమయానికి ప్రకృతి  వైపరీత్యాలతో నష్టపోయాడు. 
 
ప్రకృతివిపత్తుల నిర్వహణలో కూడా జగన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. తుఫాన్లు, వరదలు వచ్చే అవకా శాలను అంచనావేయడం, రైతులను అప్రమత్తం చేయడమనేది ఎక్కడా జరగలేదు. రెండేళ్ల వైసీపీపాలనలో ఎక్కడా ఒకఎకరాకు కూడా నీరిచ్చిందిలేదు. కొత్తగా ఎకరా భూమిసాగులోకి తెచ్చింది లేదు. వరదలు,తుఫాన్ల కారణంగా రైతులు సర్వంకోల్పోయి కష్టాలలోఉంటే, టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి నారా లోకేశ్ రైతులను పరామర్శించడానికి వెళితే, దాన్నికూడా తప్పుపట్టారు. 
 
వరదవచ్చిన వెంటనే లోకేశ్ వస్తే అంతలోనే రైతులకు సాయం ఎలా అందుతుందని ఒకమంత్రి అంటే, మరోమంత్రేమో వరదొచ్చి 15 రోజులు అయిన తర్వాత లోకేశ్ వచ్చి రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఇలా ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు మాట్లాడారు గానీ రైతులకు మాత్రం రూపాయికూడా సాయం చేయలేదు.  సాయం చేయడంచేతగాని సన్నాసి, బూతుల మంత్రి కొడాలనానీ అయితే మరీ హద్దులు మీరి మాట్లాడాడు. వెరసి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో, పంటనష్టం అంచనావేయడంలో ఘోరంగా విఫలమైంది. 
కౌలురైతులను ఆదుకోవడానికికూడా ప్రభుత్వం ఎటువంటి చర్య లుతీసుకోలేదు. 
 
తొలిపంట పూర్తిగా నాశనమైతే, రెండోపంట సాగుకి కూడాప్రభుత్వం సకాలంలో నీరందించలేకపోయింది. 
చంద్రబాబునాయుడి హాయాంలో చివరిఆయకట్టు భూములకు కూడా నీరందించడం జరిగింది. ఎక్కడైనా కాలువలనీరు అందక ఆయిల్ ఇంజన్ల సాయంతో సాగుచేస్తే, అందుకు అవసరమైన డీజిల్ ఖర్చునికూడా టీడీపీప్రభుత్వం అన్నదాతలకు అందచేసింది. కౌలురైతుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. వారికి తొలిపంటలో విపరీతంగా నష్టంరావడంతో, రెండోపంట వేయడానికి ముందుకురాని పరిస్థితులుఏర్పడ్డాయి. 
 
ఈ విధంగా వ్యవసాయ రంగాన్ని, రైతులను సర్వనాశనం చేసినఘనత జగన్ అండ్ కో కే దక్కుతుంది. రైతాంగం ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే తొలిస్థానం లో నిలిచినందుకు ఈప్రభుత్వం సంబరాలు చేసుకుంటోందా? టీడీ పీ ప్రభుత్వం హెక్టారు వరికి రూ.20వేల నష్టపరిహారం అందిస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక దాన్నిరూ.15వేలకు కుదించాడు. అది చెల్లించడానికికూడా సవాలక్ష నిబంధనలు పెట్టాడు. రైతు, రూపాయి చెల్లిస్తేచాలు పంటలబీమాలో మిగిలినసొమ్మంతా తామే చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి, రెండేళ్లపాటు దానికి సంబంధించి రూపాయికూడా బీమాకంపెనీలకుచెల్లించలేదు. 
 
దానిపై మాజీ ముఖ్యమంత్ర్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో నిలదీస్తే, సిగ్గుతో తలదించుకున్న జగన్ ప్రభుత్వం అర్థరాత్రి రూ.590 కోట్లు విడుదల చేస్తూ జీవోఇచ్చింది. అప్పటికప్పుడు జీవోఇచ్చిందికాక, అసెంబ్లీలో సిగ్గులేకుండా బీమాసొమ్ముమొత్తంచెల్లించేశామని ద బాయించారు. వానకు పంటనష్టపోయి, సర్వం కోల్పోయిన రైతులకు సకాలంలో నష్టపరిహారం అందించాలిగానీ, ఎప్పుడో ఇస్తామంటే ఎలా కుదురుతుంది? పంటనష్టపోయి, చేతిలో చిల్లిగవ్వలేని రైతు లకు సకాలంలోచేసే సాయం వారికి పనికొస్తుందిగానీ, తీరుబడిగా ఎప్పుడో ఇస్తే రైతులకు ఏం ఒరుగుతుంది? 
 
రైతులకు గిట్టుబాటు ధరఇవ్వడంలో, పంటలబీమా సొమ్ముచెల్లించడంలో అన్నింటిలో దోపిడీనే. 
వైసీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్ రెడ్డి మరికొందరు నేతలు, రైతులు పండించిన ఉత్పత్తులను తక్కువ ధరకుకొని, ఎక్కువ ధరకు అమ్ముకుంది నిజంకాదా? ఆ విధంగా రూ.20వేల కోట్ల రైతుల సొమ్ముని వైసీపీఎమ్మెల్యేలు, ఇతరనేతలు ఆర్ బీకే కేంద్రాల ముసుగులో దళారుల అవతారమెత్తి దోచేశారు. అందుకోసం ఈ ప్రభుత్వం సంబరాలుచేసుకుంటోందా? బూతుల మంత్రులతో బూతులు తిట్టిస్తే రైతులకు న్యాయంజరగదనే వాస్త వాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలి. 
 
పాదయాత్ర సమయంలో కృష్ణా జిల్లా నందిగామలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తాను అధికారంలోకి వస్తే,  సుబాబుల్ కు రూ.5వేలధర చెల్లిస్తానన్నాడు ఇప్పుడేమో రూ.1000కి కూడా ఎవరూకొనడంలేదు. తిత్లీ తుఫాన్ కారణంగా నష్టపోయిన కొబ్బరి రైతులకు ప్రతిచెట్టుకి రూ.1500 , జీడిమామిడి రైతులకు హెక్టారుకి రూ.30వేలను చంద్రబాబు నాయుడు అందించారు. కొబ్బరిచెట్టుకి రూ.3వేలు, జీడిమామిడికి రూ.50వేలు ఇస్తానని జగన్ చెప్పాడు. 
 
ఇంతవరకు అది అమలు కాలేదు. రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామంటూ మీటలు నొక్కాడు. కానీ ఇంతవరకు వారికి రూపాయికూడా అందలేదు. 
సున్నావడ్డీ, రైతుభరోసా పేరుతోకూడా రైతులను ముఖ్యమంత్రి నిలువునా వంచించాడు. అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ప్రతి రైతుకి ఏటారూ.12,500 ఇస్తానని చెప్పాడు. టీడీపీ ప్రభుత్వంలో అన్నదాతా సుఖీభవ కింద ప్రతిరైతుకి రూ.15వేలు అందించారు. 
 
రాష్ట్రప్రభుత్వవాటా రూ.9 వేలు, కేంద్రవాటా రూ.6 వేలు ఇవ్వడం జరిగింది. అదిసరిపోదని, తాను అధికారంలోకి వస్తే, రాష్ట్రప్రభుత్వ వాటాకిందే రైతుకు రూ.12,500 ఇస్తానని జగన్ రెడ్డి చెప్పాడు. కానీ అధికారంలోకివచ్చాక హళ్లికి హళ్లి, సున్నాకు సున్నా చేసి, కేంద్రమిచ్చే సొమ్ముతోకూడా కలిపి ఒక్కో రైతుకి రూ.13,500 మాత్రమే అందించాడు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 38లక్షల మంది రైతులకు రూ.6 వేలు సాయం చేస్తుంటే, రాష్ట్రప్రభుత్వం అంతే మందికి సాయంచేస్తూ, మిగిలిన వారిని నిలువునా మోస గిస్తోంది. కన్నతండ్రిలా రైతులనుకాపాడాల్సిన ముఖ్యమంత్రే కేంద్ర ప్రభుత్వమిచ్చే అప్పులకు ఆశపడి, అన్నదాతలు ఉపయోగించే విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడానికి సిద్ధమయ్యాడు. తనపై ఉన్న కేసుల భయంతో కేంద్రంచెప్పిదానికల్లా ఈ ముఖ్యమంత్రి తలాడిస్తున్నాడు. 
 
ఆ చర్యలను సమర్థించుకోవడానికి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికే మోటార్లకు మీటర్లు బిగిస్తు న్నామనిచెప్పుకుంటున్నారు. పాతాళగంగను పైకి రప్పించడాని కి సొంతడబ్బుతో మోటార్లువేసి, వాటితో పంటలు పండిస్తున్న రైతుల నోట్లో మట్టికొట్టడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది.
 పింఛన్ల పెంపులోనే ముఖ్యమంత్రి పనితనం అర్థమైంది. ఇంక మోటార్లకు మీటర్లు బిగిస్తూ, విద్యుత్ బిల్లులు ముందు అన్నదాతలు కడితే, తరువాత తాముచెల్లిస్తామనిచెప్పడం వారిని మోసగించడమే. ఆదానీ, అంబానీలకు దోచిపెట్టిందిచాలక రైతులభూములనుకూడా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టాలని చూస్తున్న కేంద్రపెద్దల ప్రాభవంకోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. 
 
వ్యవసాయరంగాన్ని నిర్వీర్యంచేసి, రైతులను భూమినుంచి విడదీసి, ఆ భూములను కార్పొరేట్ వారికి కట్టబెట్టడానికి ముఖ్య మంత్రి ప్రయత్నిస్తున్నాడు. వ్యవసాయరంగాన్నినాశనంచేయడం తోఆగకుండా, ముఖ్యమంత్రి విషపుచూపు పాడిపరిశ్రమపైకూడా పడింది. అమూల్ తో ఒప్పందంచేసుకొని, రాష్ట్రంలోని పాడి పరిశ్ర మను దానికి కట్టబెట్టడానికి రంగం సిద్ధంచేశారు. డెయిరీల ఆస్తులను, రాష్ట్రసంపదను అమూల్ కు కట్టబెట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. దోపిడీకి ఏదికాదు అనర్హమన్నట్లుగానే ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి వ్యవహరించాడు. పోలీస్, రెవెన్యూ, ఇతర యంత్రాంగాలను వాడుకుంటూ, రైతాంగాన్ని నిలువునా దోచు కుంటున్నారు. 
 
రాష్ట్ర రైతాంగం అరకన్నుతో నిద్రపోతూ, అర్థాకలితో అలమటిస్తోంది. సీఐడీచీఫ్ సునీల్ కుమార్ కు సుమోటాగా కేసులు పెట్టే అధికారముందికదా! అవినీతి విషపుత్రిక అయిన సాక్షిపత్రికలో రైతులకు చేస్తున్నసాయంపై అబద్ధాలు అచ్చేసి ముద్రిస్తున్నారు. ఏమీచేయకుండానే రైతులను అవమానిస్తూ, ఏదోచేస్తున్నట్టు రంగురంగులు ప్రకటనలిస్తున్నారు. వాటిపై సునీల్ కుమార్ సుమోటాగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై, వ్యవ సాయమంత్రిపై కేసులుఎందుకు పెట్టరు? రెండేళ్ల పాలనలో రైతులకు కడగండ్లు, కన్నీళ్లు మిగిల్చిన ప్రభుత్వానికి సంబరాలు చేసుకునే హక్కులేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు