కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో టీడీపీ ఎమ్మెల్యే దంపతులు

గురువారం, 10 డిశెంబరు 2020 (07:35 IST)
మన దేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటీ అనే దానిపై కూడా అందరిలో ఒక ఆందోళన కూడా ఉంది.

వ్యాక్సిన్ కచ్చితంగా భారత్ కి అవసరం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. మన దేశంలో కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ని తయారు చేస్తుంది.
 
అయితే మూడో దశ పరిక్షల విషయంలో ఇప్పుడు కాస్త అనుమానాలు ఉన్నాయి. ఇటీవల హర్యానా మంత్రి అనీల్ విజ్ టీకా తీసుకున్నా సరే కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఒకరు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్లో చేరారు.

భారత్ బయోటెక్ కోవ్యాగ్జిన్ ట్రయల్ రన్ కు వాలంటీర్లుగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు చేరడం గమనార్హం. ఫస్ట్ ట్రయల్ లో కోవ్యాగ్జిన్ టీకాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆయన సతీమణి గద్దె అనురాధ వేయించుకున్నారు.
 
టీకా వేయించుకున్న తర్వాత అంతా బాగానే ఉందని గద్దె రామ్మోహన్‌ దంపతులు తెలిపారు. జనవరి 4న రెండో ట్రయల్‌లో టీకా వేయించుకోనున్నట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు