జేసీపై 6 విమానయాన సంస్థలు నిషేధం... జెంబో జెట్లో జేసీ హ్యాపీగా యూరప్‌కు...

శనివారం, 17 జూన్ 2017 (16:20 IST)
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖపట్టణంలో ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగులు తనను అనుమతించలేదంటూ హంగామా చేసిన నేపధ్యంలో ఆయనపై 6 డొమెస్టిక్ విమానయాన సంస్థలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐతే జేసీ దివాకర్ రెడ్డి మాత్రం తను దురుసుగా ఏమీ ప్రవర్తించలేదనీ, తను ముందుగా వచ్చినా సిబ్బంది హంగామా చేశారంటూ చెప్పారు. 
 
డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ నిషేధం అలా సాగుతుండగానే జేసీ దివాకర్ రెడ్డి తన కుటుంబంతో కలిసి హ్యాపీగా విమానంలోనే యూరప్ ప్రయాణమై వెళ్లిపోయారు. దీనిపై ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... మా సోదరుడు విదేశీ యానంపై ఎందుకంత ఉత్సాహం... ఆయన ఇప్పుడు ప్లాన్ చేసుకోలేదు. 
 
ఎప్పుడో ప్లాన్ చేసుకున్నారు. వెళ్లారు. నేను కూడా వెళ్లాల్సింది కానీ కుదర్లేదు అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు జేసీ క్షమాపణలు చెబితే నిషేధాన్ని ఎత్తివేసేందుకు విమానయాన సంస్థలు వున్నట్లు తెలుస్తోంది. కానీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం తను తప్పేమీ చేయలేదంటూ వాదిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి