చంద్రబాబు అరెస్టుకు నిరసగా పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ధర్నా

సోమవారం, 18 సెప్టెంబరు 2023 (14:12 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఎంపీలు, పార్టీ నేతలు ధర్నా చేశారు. దీనికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయకత్వం వహించారు. 
 
చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేశారంటూ వారు ఆరోపిస్తూ ధర్నా చేశారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, వియ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి నారా లోకేశ్‌ హాజరయ్యారు. 
 
లోకేశ్‌తో పాటు ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌.. మాజీ ఎంపీలు అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, కాలవ శ్రీనివాసులు, మురళీమోహన్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, బీకే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. అధికార దుర్వినియోగంతో చంద్రబాబును అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు