తిరుపతి : ప‌్రధాని మోదీ చర్యలను సీఎం చంద్రబాబు సమర్ధిస్తుంటే, అదే పార్టీకి చెందిన ఎంపీ శివప్రసాద్ మాత్రం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన సహజ ధోరణిలో బుర్ర కథ వేషధారణ చేసి మోదీని వాయించేశారు. ప్రజలు నోట్ల రద్దు కారణంగా పడుతున్న బాధలను బుర్ర కథా రూపంలో వివరించారు. తిరుపతిలో స్టేట్ బ్యాంక్ ఎటిఎం వద్ద తన టీడీపీ ఎంపీ తన నిరసన తెలిపారు.
ఇద్దరు పిల్లలు మించి మూడో సంతానం ఉంటే, ఎన్నికలలో అనర్హులను చేసినట్లే, భార్యబిడ్డలు లేని వారిని కూడా ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులని ప్రకటించాలన్నారు. నల్లధనం నిర్మూలన ఆలోచన మంచిదే అయినా, నిర్ణయం అమలులో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని అన్నారు. మోదీకి పెళ్ళాం బిడ్డలు లేరు కాబట్టే, ప్రజల బాధలు తెలియడం లేదన్నట్లు వ్యాఖ్యలు చేశారు.
టీవీ మైక్‌లు లేకుండా మాట్లాడమని ప్రజల్ని కోరితే, తెగ తిడుతున్నారని, తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజల తరపున తాను ఇలా నిరసన తెలుపుతున్నానని ఎంపీ శివ ప్రసాద్ అన్నారు. మరి దీనిపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. చూడండి ప్రసాద్ బుర్రకథ వీడియోను...