ఇందులో యువకులకు అవకాశాం ఇవ్వాలని చంద్రబాబు అందరితో మాట్లాడిస్తున్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కు అవకాశం ఇచ్చారు. అంతే... శ్రీరాం ఉద్వేగంగా స్పీచ్ ప్రారంభించాడు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని, రాబోయే రోజుల్లో వైకాపాకి గడ్డుకాలం తప్పదన్నారు.
మన పార్టీలో చాలా మంది ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇది ప్రేక్షక పాత్ర వహించే సమయం కాదు. మనందరిపై బాధ్యత ఉంది. మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మన పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలి. వైకాపా చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు దోపిడీలకు అడ్డుకట్ట వేయాలి.