తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి పట్టుమని పది రోజులు కూడా కాలేదని, ఇంతలోనే ఏవో కొంపలు తగలబడినట్టు తన దిష్టిబొమ్మలు తగలేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రుణమాఫీపై ఒక మంత్రి తెలిసో తెలియకో ప్రకటన చేశారని, దీనిపై నానా యాగిరి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
రుణమాఫీ కాలపరిమితిపై మీడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి కేవలం నాలుగు రోజులే అయిందని, దానికే ఏవో కొంపలు మునిగిపోయినట్టు దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని, అది మంచి పద్దతికాదని కేసీఆర్ హితవు పలికారు. ఇతర పార్టీల నేతల మాటలు నమ్మవద్దని కేసీఆర్ సూచించారు.