మోటివేషన్ పేరుతో వాటిని నొక్కుతూ బాలికలను వేధించే ప్రిన్సిపాల్.. ఎక్కడ?

ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (12:58 IST)
తమ వద్దకు వచ్చే పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు మోటివేషన్ పేరుతో లైంగికంగా వేధించాడు. వీరంతా పదో తరగతి చదివే బాలికలు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండంతో ప్రత్యేక తరగతులు, ప్రిపరేషన్ పేరుతో పాఠశాలలో విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ పాఠశాలలో టెన్త్ క్లాసులో 130 మంది ఉండగా, వీరిలో 40 మందికిపై అమ్మాయిలో ఉన్నారు. ఇక్కడ ప్రిన్సిపాల్‌గా బెజవాడ శంకర్ రెడ్డి పని చేస్తున్నారు.
 
ఈయన పాడు పనికి పాల్పడ్డాడు. ప్రత్యేక తరగతులు, మోటివేషన్ పేరుతో ఒక్కో అమ్మాయిని తన గదికి పిలిపించుకుని, వారితో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. తన గదికి వచ్చే అమ్మాయిను దగ్గరకు తీసుకుని పిరుదులు, వక్షోజాలు నొక్కడం గట్టిగా హగ్ చేసుకోవడం వంటి పాడు పనులకు పాల్పడుతూ వచ్చాడు. 
 
రోజురోజుకూ అతని ఆడాలు ఎక్కువ కావడంతో బాధిత బాలికులు తమ గోడును తల్లిదండ్రుల వద్ద వెళ్లబోసుకున్నారు. దీంతో పాఠశాల ముందు ఆందోళనకు దిగడంతో అసలు విషయం అర్థం చేసుకున్న ప్రధానోపాధ్యాయుడు అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు