ఉత్తమ్ రెడ్డికి మతిభ్రమించింది : మంత్రి జగదీశ్ రెడ్డి

గురువారం, 19 సెప్టెంబరు 2019 (13:22 IST)
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతిభ్రమించిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆ వివరాలను పరిశీలిస్తే, ఓటమి ఖాయం కాబట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాటకాలు స్టార్ట్ చేశారు. బుధవారం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడించారు. 
 
ఎందుకంటే ఆయన భార్యను పెడితే ఓడిపోవడం ఖాయం.  కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మానసిక స్థితి బాగాలేదు. అక్కడ ఎలాంటి కేసులు లేకున్నా కేసులు ఉన్నాయి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. 100 శాతం కాంగ్రెస్ ఉన్న ఊరు ఇప్పుడు 100 శాతం టీఆర్ఎస్ అయింది. దీంతో ఆయన మతిభ్రమించింది.
 
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్ర వ్యక్తి అని అక్కడి ప్రజలు అంటారు. సైది రెడ్డి తెలంగాణానే. 60 యేళ్లు పాలించి ఎక్కడ కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వలేదు. కానీ మేము వచ్చిన కొద్దిరోజులలో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. తెలంగాణాలో విద్యుత్ లేకకాదు.. ఇవ్వడం రాక చేతగాని తనంతో ఇవ్వలేదు. మా సీఎం కేసీఆర్ గొప్పతనంతో విజయం సాధించాం. మొన్న 7 వేల ఓట్ల తేడాతో స్వల్ప ఓటమి, ట్రక్ గుర్తుతో మేం ఓటమి పాలయ్యాం. పార్టీ అభ్యర్థిని మా నాయకుడు నిర్ణయం తీసుకుంటాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు