తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా సాగుతున్న టెట్ పరీక్ష

శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (10:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్ష శుక్రవారం ఉదయం నుంచి సాఫీగా ప్రారంభమై ప్రశాంతంగా సాగుతుంది. ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇందులోభాగంగా తొలి పేపర్ శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగనుంది. అలాగే, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
మొదటి పేపర్‌ పరీక్షను 1139 కేంద్రాల్లో నిర్వహిస్తుండగా, రెండే పేపర్ పరీక్షను 913 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేసారు. పేపర్-1కు 2,69,557 మంది, రెండో పేపర్‌కు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల నేపథ్యంలో విద్యా సంస్థలకు ప్రత్యేక సెలవును ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం నుంచే ఆయా విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. ఇదే విధంగా పరీక్షల పర్యవేక్షణ కోసం 2052 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22572 మంది ఇన్విజిలేటర్లు, 10260 మంది హాల్ సూపరింటెండెంట్లను నియమించడం జరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు