చిత్తూరు, తిరుపతి, పాకాల, దామలచెరువు, కల్లూరు ప్రాంతాలకు చెందిన 80 మంది ముస్లింలు అజ్మీర్ యాత్రకు వెళ్లారు. మార్చి 13వ తేదీన రాజస్థాన్‌లోని అజ్మీర్ యాత్రకు వెళ్లారు.
సడన్‌గా లాక్‌డౌన్ విధించడంతో తాము అక్కడ ఇబ్బందుల్లో చిక్కుకున్నామని వారు తెలిపారు. స్థానికంగా ఓ సత్రంలో తలదాచుకుంటూ, చేతిలో డబ్బులు మొత్తం పూర్తిగా ఖర్చయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ లాక్‌డౌన్ పొడిగింపుతో తామంతా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
యాత్రకు వెళ్లిన వ్యక్తుల్లో చిన్నపిల్లలు , వృద్ధులు, రకరకాలైన వ్యాధిగ్రస్తులు ఉన్నందున మరింత ఇబ్బందులు పడుతున్నామని బాధితులు పేర్కొన్నారు.